రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ తటస్థ స్థితి సరైనది: కాంగ్రెస్ ఎంపీ 1 y ago
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం విషయంలో భారత్ వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సమర్థించారు. యూరప్ వ్యవహారాల్లో భారత్ ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం వల్ల శాశ్వత శాంతి సాధించే స్థితిలో ఉందని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం దేశం అనేక ప్రయోజనాలు పొందుతోందని కొనియాడారు. అయితే 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చేపట్టినప్పుడు భారత్ దానిని ఖండించాలని శశిథరూర్ కోరారు. అప్పుడు భారత్ వైఖరిని ఆక్షేపించిన ఆయన ఇప్పుడు భారత్ తటస్థ స్థతిని మెచ్చుకోవడం విశేషం.